Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో దిలీప్‌ నిద్రలేని రాత్రులు.. ఆగస్టు 22 వరకు కస్టడీ పొడిగింపు.. 15 తోటి ఖైదీలతోనే?

ప్రముఖ నటి భావన లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కేసులో జైలులో ఉన్న స్టార్ హీరో దిలీప్.. తన భార్య కావ్యమాధవన్‌ను పోలీసులు పదేపదే ప్రశ్నించడంపై ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. జైలులో దిలీప్ తీవ్ర ఒత్

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (12:05 IST)
ప్రముఖ నటి భావన లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కేసులో జైలులో ఉన్న స్టార్ హీరో దిలీప్.. తన భార్య కావ్యమాధవన్‌ను పోలీసులు పదేపదే ప్రశ్నించడంపై ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. జైలులో దిలీప్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని జాతీయ మీడియాల్లో వార్తలొస్తున్నాయి. జైలులో దిలీప్ నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారని, అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వార్తలొస్తున్నాయి. 
 
ఫలితంగా దిలీప్ అనారోగ్యానికి గురయ్యాడని, భద్రతా కారణాల రీత్యా ఆయనను ఆసుపత్రికి తరలించడం లేదని, జైల్లోనే వైద్యమందిస్తున్నారని జైలు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఈ నెల 2న దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌ను ప్రశ్నించిన పోలీసులు, ఆయనతో వివాహం, వివాహానికి ముందు, తరువాత ఆయన వ్యవహార శైలిపై కూపీ లాగినట్టు తెలుస్తోంది. కాగా, దిలీప్‌కు మూడు వివాహాలు అయినట్టు పోలీసు దర్యాప్తులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ ఆగస్టు 22వ తేదీ వరకు జైలుకే పరిమితం కానున్నాడు. మంగళవారం కేరళలోని అంగమాలి మెజిస్ట్రేట్ కోర్టు దిలీప్ జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు చిక్కిన నిందితుడు పల్సర్ సునీ నోరు విప్పడంతో దిలీప్ అరెస్టు చేశారు. పోలీసుల విచారణ అనంతరం దిలీప్ ను ఆలువా సబ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా దిలీప్ ఆలువా సబ్ జైల్లోనే ఉన్నాడు. ఆగస్టు 15వ తేదీన సాటి ఖైదీలతో దిలీప్ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోనాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం