Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ సినిమాలు బాగానే ఆడుతున్నాయి... దిల్ రాజు

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేశాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం కూడా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. నాకు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం మూడు సినిమాలు విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్నాయి. ఓవ‌ర్‌సీస్‌

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (21:44 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేశాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం కూడా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. నాకు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం మూడు సినిమాలు విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్నాయి. ఓవ‌ర్‌సీస్‌లో కూడా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఓవ‌ర్‌సీస్‌లో వ‌న్ మిలియ‌న్ రీచ్ అయ్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి నిర్మాత దిల్‌రాజు అన్నారు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'శతమానంభవతి`. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌లైంది.  
 
స‌క్సెస్ రెస్పాన్స్‌....
ఈస్ట్‌, వెస్ట్‌, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో నా రెగ్యుల‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌కే సినిమాను ఇచ్చేశాను. ఈ మ‌ధ్య కాలంలో ఇంత మంచి రెవెన్యూ నా సినిమాల‌కు రాలేద‌నే చెప్పాలి. మూడో రోజుకే వారు పెట్టిన డ‌బ్బులు వ‌చ్చేశాయ‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్ అన్నారు. సినిమాపై పాజిటివ్ బ‌జ్ రావ‌డం, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణా, వైజాగ్‌, నైజాంలో సినిమాను మేమే రిలీజ్ చేశాం. ఈ సినిమాకు మూడు రోజుల్లో వారు పెట్టిన డ‌బ్బు వ‌చ్చేసి నాలుగో రోజుకు ఓవ‌ర్‌ఫ్లో రావ‌డం ఆనందంగా ఉంది. `శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రానికి అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.
 
ఆ పాయింట్ నాకు న‌చ్చింది...
స‌తీష్ వేగేశ్న నా బ్యాన‌ర్‌లో రూపొందిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ ర్యాపో వ‌ల్ల ఓసారి న‌న్ను క‌లిసి సార్‌..నా ద‌గ్గ‌ర ఓ పాయింట్ ఉంది వింటారా..అని అన్నాడు. స‌రేన‌ని అన్నాను. త‌ను చెప్పిన పాయింట్ నాకు బాగా న‌చ్చింది. త‌ప్ప‌కుండా మ‌నం ప‌నిచేద్దామ‌ని, ఒక సంవ‌త్స‌రం పాటు క‌థ‌పై వ‌ర్క్ చేశాం. ప్ర‌కాష్ రాజ్‌గారు, హీరో నాని కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. అలా న‌లుగురైదుగురు నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని చేశాం
 
అన్నీ ర‌కాల సినిమాలు చేయాలి...
అందరూ హీరోలు కొత్త‌గా చేయాల‌ని చూస్తున్నారు. ఒక త‌ర‌హా సినిమాలు చేస్తే మోనాట‌నీ వ‌చ్చేస్తుంది. అందుకే కొత్త క‌థ‌లతో సినిమా చేయాలి. శ‌ర్వానంద్ కూడా ఇప్పుడు అలాగే కొత్త‌గా ఫ్యామిలీ స‌బ్జెక్ట్ చేశాడన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments