Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లిప్ లాక్ కిస్' పెట్టమన్నారనీ సినిమా ఛాన్స్ వదులుకున్న సాయిపల్లవి (video)

Webdunia
గురువారం, 18 జులై 2019 (16:11 IST)
టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ. ఈయన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవిని ఎన్నుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో రష్మిక మందన్నాకు అవకాశం ఇచ్చారు. అయితే, సాయి పల్లవి నో చెప్పడానికి కారణాలు లేకపోలేదు. 
 
'డియర్ కామ్రేడ్' కథ ప్రకారం లిప్ లాక్ సీన్స్ ఉంటాయని దర్శకుడు చెప్పడంతో నో చెప్పిందని సమాచారం. అలాంటి సన్నివేశాల్లో తాను నటించబోనని తేల్చి చెప్పింది. నిజానికి వెండితెరకు సాయి పల్లవి పరిచయమైనప్పటి నుంచి మంచి నటనతో కూడిన పాత్రలను చేస్తూ ముందుకుసాగుతోంది. 
 
అలాంటి పాత్రలు చేస్తూనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి హీరోయిన్లు కూడా వారిలా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తామంటే కుదరదు. గ్లామర్ షో చేస్తేనే ఈకాలం హీరోయిన్లకు వరుస ఆఫర్స్ వస్తాయని తెలిసి కూడా సాయి పల్లవి నో చెబుతోంది. 
 
అయితే, సాయి పల్లవి - సూర్యతో కలిసి నటించిన చిత్రం "ఎన్జీకే". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయినప్పటికీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం భారీగానే వస్తున్నాయి. మరోవైపు తమిళ హీరో ధనుష్‌తో కలిసి నటించిన "మారి-2" సినిమాలో రౌడీ బేబీ పాటకు సోషల్ మీడియాలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 
 
అదేవిధంగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాకు కూడా ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవినే.. కానీ అనుకోని విధంగా రష్మికను తీసుకున్నారు. సాయి పల్లవి మాత్రం తప్పుకోడానికి కారణాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments