Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను హిందూ వ్యతిరేకి అనండి.. హోలీ కామెంట్స్‌పై సారీ చెప్పిన దియా మీర్జా!

దియా మీర్జా హోలీ కామెంట్స్‌కు సారీ చెప్పింది.. మనసు చలించిపోయి అలా..?

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2016 (18:10 IST)
హోలీ పండుగపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి దియా మీర్జా వివరణ ఇచ్చింది. ఓ వైపు కరువుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కొందరేమో హోలీ అంటూ నీటిని వృధా చేస్తున్నారని దియా మీర్జా అన్నారు. అంతేగాకుండా అలాంటి ప్రాంతంలో మనం నివసిస్తున్నాం.. ఇలా అంటున్నందుకు తనను హిందూ వ్యతిరేకి అనండి అంటూ దియా మీర్జా ట్వీట్ చేశారు.

అయితే ఈ కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో దియా మీర్జా వివరణ ఇచ్చుకున్నారు. హోలీ పండుగపై గతంలో తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరింది. మనసు చలించిపోయి అలా మాట్లాడానని తెలిపింది. 
 
ఇంకా దియా మీర్జా మాట్సాడుతూ.. తనకు అన్ని మతాలు, ఆచారాలు, పండుగల మీద విశ్వాసం ఉంది. ఓ వర్గం మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని చెప్పింది. నీటి కొరత కారణంగా మహారాష్ట్రలో రైతులు ఎంత తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారో అందరికీ తెలుసునని వివరించింది.

"నీటి సంరక్షణ అనేది మన తక్షణ కర్తవ్యం. అందరికీ నా విన్నపం ఏంటంటే.. ఆచారాలను గౌరవిస్తూ.. డ్రై హోలీ జరుపుకుందామ"ని దియా మిర్జా విజ్ఞప్తి చేసింది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments