Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుచు అమ్మాయిలపైనే దర్శకులు చూపు : దియా మీర్జా

బాలీవుడ్ నటి దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఖల్‌నాయక్ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దియా మీర్జా రీ ఎంట్రీ ఇస్త

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (12:39 IST)
బాలీవుడ్ నటి దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఖల్‌నాయక్ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దియా మీర్జా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ పాత్రలో దియా మీర్జా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత దర్శక నిర్మాతల చూపంతా యంగ్ హీరోయిన్లపైనే ఉందని వ్యాఖ్యానించింది.
 
ముఖ్యంగా, కథానాయికలు నటపరంగా ఎంతో ఆకట్టుకున్నా కూడా ఆ హీరోయిన్ వయసు 30 దాటిందంటే చాలు అవకాశం ఇవ్వడానికి ఏ డైరెక్టర్ ముందుకు రావటం లేదని వాపోయింది. ప్రధానంగా దర్శకనిర్మాతల చూపంతా పడుచు అమ్మాయిలపైనే కేంద్రీకృతమైవుందని అభిప్రాయపడింది. 
 
తమ సినిమాల్లో నటించేందుకు వారికే అవకాశం ఇస్తున్నారే.. తప్ప సీనియర్ హీరోయిన్ వైపు చూడటం లేదు. కాస్త వయసు పైబడినంత మాత్రాన నటనకు పనికిరామా? అంటూ తన ఆవేదన వెళ్లబుచ్చుతూనే.. రానురాను సినిమా రంగంలో మార్పులు గమనిస్తున్నాం.. మరి హీరోయిన్స్ పర్సనల్ లైఫ్‌లో మార్పులు రాకూడదా? అని ఆమె ప్రశ్నిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments