Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ్‌ల 'మిస్టర్‌ కార్తీక్‌'

ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా '7/జి బృందావన్ కాలనీ' ఫేమ్‌ శ్రీ రాఘవ (సెల్వరాఘవన్‌) దర్శకత్వంలో రూపొందిన 'మయక్కం ఎన్నా' చిత్రాన్ని తెలుగులో 'మిస్టర్‌ కార

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (17:25 IST)
ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా '7/జి బృందావన్ కాలనీ' ఫేమ్‌ శ్రీ రాఘవ (సెల్వరాఘవన్‌) దర్శకత్వంలో రూపొందిన 'మయక్కం ఎన్నా' చిత్రాన్ని తెలుగులో 'మిస్టర్‌ కార్తీక్‌' పేరుతో నిర్మాతలు కె.బాబురావు, కె.మల్లిఖార్జున్‌లు అనువదించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రముఖుల సమక్షంలో జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను సముద్ర, రాజ్‌ కందుకూరిలు ఆవిష్కరించారు. ఆడియో సీడీని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఆవిష్కరించి మరో నిర్మాత ఆర్‌.కె.గౌడ్‌కు అందచేశారు. శివరంజని మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో 'జబర్దస్త్‌' ఫణి కామెడీని పండించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ తమిళంలో మంచి విజయం సాధించిన ఈ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం, తెలుగులోనూ మంచి సక్సెస్‌ని సాధిస్తుంది. మేము నిర్మాతలుగా మారడానికి కారణం సి.కళ్యాణ్‌. ఆయన ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని మేం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. మా ఈ ప్రయత్నంను ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 
 
డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ధనుష్‌ అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణకానుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు నగేష్‌ నారదాసి, భూషణ్‌, మాటల రచయిత వెంకట్‌ మల్లూరి తదితరులు పాల్గొని.. చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు. ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌, రైటర్‌: శశాంక్‌ వెన్నెలకంటి; మాటలు: వెంకట్‌ మల్లూరి, నిర్మాతలు‌: కె.బాబురావు, కె.మల్లిఖార్జున్‌; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరాఘవ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments