Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్ మిల్లర్ నుంచి ధనుష్ ఫస్ట్ లుక్

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (18:52 IST)
Captain Miller look
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు.
 
తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ ని చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపించారు ధనుష్. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ధనుష్ లుక్ టెర్రిఫిక్ గా వుంది.
 
ఈ చిత్రంలో కన్నడ స్టార్  శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీశ్‌  తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి,శ్రేయాస్ కృష్ణ డీవోపీ గా పని చేస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.
'కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, శివరాజ్‌ కుమార్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీశ్‌ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Google: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఏమిటంటే..?

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments