Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి వస్తోన్న తిరు.. ధనుష్‌ క్రేజ్ ఏమాత్రం తగ్గదట..

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (17:35 IST)
కొలవెరి ఫేమ్ ధనుష్ నటించిన "తిరుచిట్రంబలం" మూవీ తిరు పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 
 
ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడింది. అంతేకాకుండా ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. 
 
ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం గత రాత్రి నుండి ‘సన్‌ ఎన్‌ఎక్స్‌టీ’లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. 
 
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, నిత్యామీనన్‌, ప్రియా భవాని శంకర్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనురుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
 
ప్రస్తుతం ధనుష్ నటించిన 'నానే వరువెన్' విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్స్ట్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'సార్' డిసెంబర్ 2న విడుదల కానుంది. ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments