Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లంటే విముఖత చూపుతున్న హీరోయిన్లు... అదే కోవలో ధన్సిక

ఇష్టంలేకున్నా గ్లామర్ పాత్రలు ధరించి విసుగెత్తిన కొందరు హీరోయిన్లు పెళ్లి, సుఖాలు వంటి ఐహిక సుఖాలకే విముఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చిత్రసీమలో అడుగుపెట్టి అనతికాలంలోనే ఆధ్యాత్మిక బాట పట్టిన వారిలో గీతాంజలి హీరోయిన్ గిరిజ, సర్వదమన్ బెనర్జీ వంటి వారు

Webdunia
సోమవారం, 15 మే 2017 (03:23 IST)
ఇష్టంలేకున్నా గ్లామర్ పాత్రలు ధరించి విసుగెత్తిన కొందరు హీరోయిన్లు పెళ్లి, సుఖాలు వంటి ఐహిక సుఖాలకే విముఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చిత్రసీమలో అడుగుపెట్టి అనతికాలంలోనే ఆధ్యాత్మిక బాట పట్టిన వారిలో గీతాంజలి హీరోయిన్ గిరిజ, సర్వదమన్ బెనర్జీ వంటి వారున్నారు. కబాలి సినిమాలో రజనీకాంత్ కుమార్తెగా నటించి మెరిసిన ధన్సిక తాజాగా ఆధ్యాత్మిక చింతనను చేపట్టి పెళ్లి చేసుకోనంటూ సంచలన ప్రకటన చేసింది.
 
కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోకి పరిచయమైన నటి ధన్సిక.. పెళ్లి చేసుకోను, ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నానంటోంది నటి ధన్సిక. పేరాన్మై చిత్రం ద్వారా కోలీవుడ్‌ తెరపై మెరిసిన ఈ భామ ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటిది కబాలి చిత్రంలో రజనీకాంత్‌కు కూతురిగా నటించింది కాసేపే అయినా ఇరగదీసింది. అందుకు మంచి పేరే తెచ్చుకుంది కూడా. 
 
కొత్తలో తెలియక గ్లామర్‌ పాత్రల్లో నటించానని అయితే ఇకపై గ్లామరస్‌గా నటించేది లేదని చెప్పింది ధన్సిక. తాను సాయి భక్తురాలినని, అందుకే తన పేరును కూడా సాయి ధన్సికగా మార్చుకున్నానని తెలిపింది. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్న తనకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని అంది. అనాథాశ్రమాన్ని కట్టించనున్నానని తెలిపింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments