Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్సీస్‌లోనూ ‘ధనలక్ష్మి..’ తలుపు తట్టడం ఖాయం!!

Webdunia
బుధవారం, 29 జులై 2015 (18:36 IST)
మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణ.. సాయి అచ్యుత్‌ చిన్నారి దర్శకత్వంలో` ధనరాజ్‌, మనోజ్‌ నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, రణధీర్‌, శ్రీముఖి, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్‌ ముఖ్య తారాగణంగా భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ధనక్ష్మి తలుపు తడితే’ చిత్రం ఈనె 31న విడుదలవుతోంది. విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ, చిత్ర దర్శకుడు సాయి అచ్యుత్‌ చిన్నారి, ముఖ్యపాత్రధారులు ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, శ్రీముఖి, కెమెరామెన్‌ శివతోపాటు కొడాలి వెంకటేశ్వర్రావు, వడ్లపట్ల మోహన్‌, వల్లూరిపల్లి రమేష్‌ అతిథుగా పాల్గొన్నారు. 
 
‘ధనక్ష్మి తలుపు తడితే’లో సక్సెస్‌ కళ కొట్టొచ్చినట్లు కనబడుతోందని.. ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధించడం ఖాయమని అతిథులు పేర్కొనగా.. సంవత్సర కాలంగా తాము పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రేక్షకులు అందిస్తారనే నమ్మకం తమకుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. భీమవరం టాకీస్‌ నుంచి 75వ సినిమాగా వస్తున్న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ పెద్ద సినిమా రేంజ్‌లో విడుదలవుతోందని.. చాలా పెద్ద రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందనడంలోనూ ఎటువంటి సందేహాలకు తావు లేదని నిర్మాత రామసత్యనారాయణ అన్నారు. 
 
ఓవర్‌సీస్‌లో కూడా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ రిలీజ్‌ అవుతుండటాన్ని బట్టి ఈ చిత్రానికి గల క్రేజ్‌ని అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న హైద్రాబాద్‌ పరిసర గ్రామం శేరిలింగంపల్లి నివాసి కాళీవరప్రసాద్‌కి ‘ధనక్ష్మి తలుపు తడితే’ యూనిట్‌ తరపున 10 వేల రూపాయల చెక్కును ఈ సందర్బంగా అతని భార్యకి అతిథులతో అందజేయించారు. బోలే శావలి సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ రెడ్డి మల్లు (యుఎస్‌ఎ)` ప్రతాప్‌ భీమిరెడ్డి(యుఎస్‌ఎ)!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments