Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఉప్పెన"తో డీఎస్పీకి మంచిరోజు... వన్స్‌మోర్ అంటున్న కొరటాల

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (15:29 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం "ఉప్పెన". బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌కు మళ్లీ మంచిరోజులు వచ్చాయని చెప్పొచ్చు. 
 
ఉప్పెన మ్యూజికల హిట్‌‌గా నిలవడంతో స్టార్‌ హీరోలంతా డీఎస్పీ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా దేవిశ్రీని ఎన్టీఆర్‌ సినిమాకి మ్యూజిక్‌ అందివ్వబోతున్నాడని హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ వినిపిస్తోంది.
 
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "జనతా గ్యారేజ్" సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాకి దేవిశ్రీనే సంగీతం అందించాడు. 
 
ఇపుడు మరో చిత్రం రానుంది. దీనికికూడా దేవినే మ్యూజిక్‌ డైరక్టరుగా పెట్టుకోవాలని కొరటాల భావిస్తున్నాడు. ఇప్పటివరకు కొరటాల దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి దేవినే సంగీతం అందించడం గమనార్హం. 
 
నిజానికి మెగాస్టార్ చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న "ఆచార్య" చిత్రానికి కూడా తొలుత దేవినే అనుకున్నారు. కానీ మణిశర్మని తీసుకోవాలని మెగా ఫ్యామిలీ సూచించడంతో కొరటాల కాదనలేకపోయారు. 
 
ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌‌తో చేయబోయే సినిమాకి దేవినే తీసుకోవాలని భావిస్తున్నాడట. ఎన్టీఆర్‌‌కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి దేవిశ్రీ పేరునే ఖరారు చేస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం డీఎస్పీ... అల్లు అర్జున్‌ నటిస్తున్న "పుష్ప" సినిమాకి చేస్తున్నాడు. అలాగే రామ్‌ పోతినేని - లింగుస్వామి డైరక్షన్‌‌లో రాబోతున్న సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments