Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నప్ప లో ఎరుకల తెగకు నాయకుడిగా దేవరాజ్ లుక్

డీవీ
సోమవారం, 5 ఆగస్టు 2024 (16:19 IST)
కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవరాజ్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
కన్నప్ప చిత్రంలో దిగ్గజ నటులున్నారన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప వరల్డ్‌ని పరిచయం చేసి జనాల్లో హైప్ పెంచేశారు. ఇక ఇలా ప్రతీ సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ ఆడియెన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు.
 
తాజాగా దేవరాజ్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో దేవరాజ్ ఎరుకల తెగకు నాయకుడిగా కనిపించనున్నారు. ఎరుకల తెగ నాయకుడైన ‘ముండడు’ అనే పాత్రలో దేవరాజ్ అద్భుతమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
"కన్నప్ప" విజువల్ వండర్‌గా ఇండియన్ స్క్రీన్ మీద ఆకట్టుకోబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానున్నట్టుగా మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments