ప్రముఖ సినీ నటులపై ఢిల్లీ పోలీసుల కేసు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:11 IST)
'దిశ రేప్​' ఘటనకు సంబంధించి ప్రముఖ సినీనటులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసినందుకుగాను వారిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత 2019లో హైదరాబాద్​లో జరిగిన దిశ హత్యాచారానికి సంబంధించి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్​ సహా 38 మందిపై కేసు నమోదైంది. 
 
బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల వేదికగా బహిర్గతం చేసినందుకు ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్​ దాఖలు చేశారు. 
 
అలాగే, సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు గౌరవ్. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరవ్. హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments