Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ దీక్ష కనెక్ట్ అవుతుంది

డీవీ
బుధవారం, 28 ఆగస్టు 2024 (15:57 IST)
Kiran, goud, akshakhan
ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాయి. ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. భీముడి గెటప్ లో ఆయన చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుంది. ‘దీక్ష’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంఛ్ చేస్తాం. త్వరలో జరగనున్న తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల్లో సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు
 
హీరో కిరణ్ మాట్లాడుతూ,  ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఆర్కే గౌడ్ అన్నగారు రూపొందించారు. ‘దీక్ష’ చిత్రంతో హీరోగా నాకు మంచి పేరొస్తుంది ఆశిస్తున్నా. నాతో పాటు మా టీమ్ అందరికీ ఈ సినిమా గుర్తింపు తీసుకొస్తుంది. అన్నారు.
 
నటి అనూష మాట్లాడుతూ - ‘దీక్ష’ సినిమాలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో నాకు నటిగా గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. త్వరలో రిలీజ్ అవుతున్న ‘దీక్ష’ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటి తులసి మాట్లాడుతూ - ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. నటిగా నాకు గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. ‘దీక్ష’సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటి అక్సాఖాన్ మాట్లాడుతూ - ‘దీక్ష’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంతో పాటు 18 భాషల్లో వస్తున్న మహిళా కబడ్డి మూవీలోనూ ఆర్కే గౌడ్ గారు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.
 
ఈ కార్యక్రమంలో దీక్ష చిత్రబృందంతో పాటు కావేరి చిత్ర నిర్మాత షేక్ అల్లాబక్షు, కావేరి చిత్రబృందం పాల్గొని దీక్ష సినిమా టీమ్ కు బెస్ట్ విశెస్ అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments