Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి డార్లింగ్ ఇదీ... ఇక నీది హాలీవుడ్ రేంజేగా... సాహో టీజర్ అదుర్స్(Video)

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (18:00 IST)
గురువారం సాహో టీం విడుదల చేసిన టీజర్ చూస్తే మామూలుగా లేదు. చూస్తుంటే ప్రభాస్ హాలీవుడ్ స్టార్ రేంజికి వెళ్లిపోయినట్లు కనబడుతున్నాడు. అతడి స్టామినా ఓ రేంజికి వెళ్లిపోయింది. సాహో చూశాక డార్లింగ్ ప్రభాస్ కోసం హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడతారేమో మరి.
 
ఇకపోతే డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వస్తున్న ''సాహో'' టీజర్ గురువారం విడుదలైంది. గత మూడురోజులుగా టాప్ ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన సాహో టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ శ్రద్ధా కపూర్ చెప్పే డైలాగుతో ప్రారంభమవుతుంది. బాధైనా, సంతోషమైనా పంచుకోవడాని నాకు ఎవరు లేరనే సెంటిమెంటల్ డైలాగ్‌ బాగుంది. 
 
వెంటనే ట్రైలర్ వేగం అందుకుంటుంది. కాస్త రొమాన్స్.. కాస్త యాక్షన్‌గా ట్రైలర్ సాగింది. అత్యాధునిక సాంకేతిక విలువలు ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. సోహోలో ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపించింది. భారీ చేసింగ్స్, విధ్వంసకమైన యాక్షన్ సీన్స్ ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉన్నాయి. నీల్ నితేశ్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మూవీలో కీలకపాత్రల నటించారు. 
 
శ్రద్దా గ్లామర్ గర్ల్ కంటే కూడా ప్రభాస్‌తో కలిసి విలన్స్‌‌ని ఇరగదీసే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్ అని చెప్పవచ్చు. ఫారిన్ ఫైటర్స్‌తో ప్రభాస్ పోరాటాలు పీక్స్‌లో ఉన్నాయి. మొత్తానికి ''సాహో'' ట్రైలర్ హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌లా వుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుందని ట్రైలర్లోనే చెప్పేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments