Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయక్ ను ఆఫ్ట్రాల్ ఎస్ ఐ అంటున్న డేనియల్ శేఖర్

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:50 IST)
Rana Daggubati
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
 
‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి నేడు ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర బృందం. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి ఆయన పోషిస్తున్న  డేనియల్ శేఖర్  పాత్ర కు సంబంధించినదే ఈ ప్రచార చిత్రం. ‘భీమ్లా నాయక్' పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ  ప్రచార చిత్రాన్ని పరికిస్తే.
"వాడు అరిస్తే భయపడతావా  -  ఆడికన్నా గట్టిగా అరవగలను -  ఎవడాడు....
 
దీనమ్మ దిగొచ్చాడా...  ఆఫ్ట్రాల్ ఎస్ ఐ
 
సస్పెండెడ్...." అంటూ  డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా ఎవరితోనో చిత్ర కథానుసారం సంభాషించటాన్ని ఇందులో చూడవచ్చు. ఈ సన్నివేశం ఉత్సుకతను రేకెత్తిస్తోంది.
 
‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.
 
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments