Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2వేల కోట్ల వసూళ్లతో ''దంగల్'' అదుర్స్.. అవతార్, జురాసిక్ వరల్డ్ సరసన?

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. భారత్ కంటే చైనాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తాజాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (15:15 IST)
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. భారత్ కంటే చైనాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తాజాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మేగజైన్ పేర్కొంది. చైనాలో 53వ రోజున రూ.2.5 కోట్లు వసూలు చేయడంతో, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.2 వేల కోట్లు (307 మిలియన్ డాలర్లు) వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. 
 
అలాగే ఇంగ్లీషేతర సినిమాల్లో అత్యధిక వసూళ్లలో దంగల్ సినిమా ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక చైనాలో అత్యధిక వసూళ్ల సాధించిన తొలి 16 హాలీవుడ్ యేతర సినిమాల్లో దంగల్ కూడా స్థానం దక్కించుకుంది. ఫలితంగా దంగల్ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలైన ‘అవతార్’, ‘జురాసిక్ వరల్డ్’ సినిమాల సరసన నిలిచింది. అవతార్, జురాసిక్ వరల్డ్ సినిమాలు చైనా బాక్సాఫీసు వద్ద 15, 14 స్థానాల్లో నిలవగా ఆ తర్వాతి స్థానంలో దంగల్ నిలిచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments