Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'దండుపాళ్యం-2'.. సెన్సేషన్ తథ్యమంటున్న దర్శకనిర్మాత

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడంలో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం రూ.30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చే

Dandupalyam Telugu Full Movie
Webdunia
బుధవారం, 17 మే 2017 (15:55 IST)
వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడంలో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం రూ.30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. 'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి రూ.10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. 
 
తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు 
 
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ.. ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. తెలుగు, కన్నడ భాషల్లో 'దండుపాళ్యం' కలెక్షన్ల పరంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అద్భుతమైన కలెక్షన్స్‌తో 100 రోజులు ఆడింది. ఇప్పుడు 'దండుపాళ్యం2' మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యడానికి రెడీ అవుతోందన్నారు. 
 
డైరెక్టర్‌ శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే 'దండుపాళ్యం2' చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. దండుపాళ్యం చిత్రాన్ని మించి 'దండుపాళ్యం2' తెలుగు, కన్నడ భాషల్లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు. 
 
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ''రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో, కన్నడలో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలాగే 'దండుపాళ్యం2' చిత్రంలోని కథ, కథనాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు. 
 
ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments