Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2 కోసం కిస్సిక్‌ సాంగ్‌ చేసిన డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల

డీవీ
సోమవారం, 11 నవంబరు 2024 (10:30 IST)
Sreleela dance
పుష్ప చిత్రంలో సమంతో ఐటెం సాగ్ చేయించిన సుకుమార్ సీక్వెల్ లో శ్రీలీలతో ఐటెంసాంగ్ చిత్రీకరించారు. చీకటిపడితే మగాళ్ళంతా ఒక్కటే అంటూ సమంతో క్లబ్ డాన్స్ చేయిచగా ఈసారి కిస్సింగ్ అనే పాటను శ్రీలీలతో చేయించారు. పైగా ఆమెకు డ్యాన్సింగ్‌ క్వీన్‌ అనే బిరుదుకూడా ఆపాదించారు. ఈ సాంగ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. దీనికి సంబంధించిన స్టిల్ ను విడుదల చేశారు.
 
కాగా, డ్యాన్సింగ్‌లో కూడా వన్‌ ఆఫ్‌ ద ఫైనెస్ట్‌ ఇండియన్‌ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల చేయడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌   పుష్ప-2 ది రూల్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు.  ఐకాన్‌ స్టార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకుడు.సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రెస్టేజియస్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు
 
డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్‌ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది.  ఇక  పుష్ప ది రైజ్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సమంతలపై చిత్రీకరించిన ఊ అంటావా మామా ఊఊ అంటావా సాంగ్‌ జాతీయ స్థాయిలో ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దిరూల్‌లో  చిత్రీకరిస్తున్న ఈ మాసివ్‌ నెంబర్‌ దానికి మించి ఉండబోతుంది. ఈ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌లో ఐకాన్‌ స్టార్‌ సూపర్భ్‌ డ్యాన్స్, ఆయన స్వాగ్‌ ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాయి. 
 
త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను   పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌  హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్‌ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్‌ షేక్‌ చేయడానికి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments