Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలికే టోకరా వేశారంటే వీళ్లెంత ఘనులై ఉండాలి. నేరుగా నిర్మాతకే బెదిరింపు కాల్.. అక్కడే దొరికారు

ఆ సినిమాను పైరసీ చేయడం అంత సులభం కాదు. ఎక్కడ పైరసీ జరిగినా నిమిషాల మీద పోలీసు డిపార్ట్‌మెంట్ స్పందించి తగు చర్య తీసుకునేలా ఆ చిత్ర నిర్మాతలు పటిష్ట చర్యలు తీసుకున్నారు. పైగా ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా. కాని సినిమా దొంగలు బరితెగించారు. అది

Webdunia
బుధవారం, 17 మే 2017 (09:26 IST)
ఆ సినిమాను పైరసీ చేయడం అంత సులభం కాదు. ఎక్కడ పైరసీ జరిగినా నిమిషాల మీద పోలీసు డిపార్ట్‌మెంట్ స్పందించి తగు చర్య తీసుకునేలా ఆ చిత్ర నిర్మాతలు పటిష్ట చర్యలు తీసుకున్నారు. పైగా ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా. కాని సినిమా దొంగలు బరితెగించారు. అది మామూలు బరితెగింపు కాదు. నేరుగా నిర్మాతలకే ఫోన్ చేసి వారానికి 15 లక్షలు ఇస్తారా లేక ఇంటర్నెట్‌లో పెట్టేయమంటారా అంటూ బెదిరించేంత స్థాయి బరితెగింపు.

కానీ ఢిల్లీ, బీహార్ కేంద్రాలుగా జరిగిన ఈ పైరసీ వ్యవహారం గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేయడానికి కీ కూడా వారే సమర్పించుకున్నారు. అదే.. నిర్మాతలకు నేరుగా ఫోన్ చేయడం.. కానీ బాహుబలికే వీరు టోకరా వేశారంటే వీళ్లెంత ఘనులై ఉండాలని నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఇంతకీ అత్యంత పటిష్ట సాంకేతిక భద్రతతో చిత్ర నిర్మాతలు విడుదల చేసే కీని కూడా ఛేదించి వీళ్లు బాహుబలి సినిమాను ఎలా పైరసీ చేయగలిగారు అనేదే ఇప్పుడు సంచలనం అయి కూర్చుంది. నిర్మాత నుంచి పంపిణీదారుకు నేరుగా అందే చిత్రం విడుదల కీలో ఒక చిన్న లోపాన్ని పసిగట్టడమే పైరసీదారులకు లడ్డులాంటి అవకాశాన్ని ఇచ్చింది. అదేంటో చూద్దాం.
 
ఏ సినిమా అయినా సరే నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని సాప్ట్ కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్‌కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్‌లో నిక్షి ప్తంచేస్తారు. ఈ బ్రాడ్‌కాస్టర్లు సినిమా సాఫ్ట్‌కాపీని ఎన్‌క్రిప్షన్‌లోకి (కోడ్‌ లాంగ్వేజ్‌) మార్చేస్తారు. దీన్ని డీక్రిప్షన్‌కు (సాధారణ చిత్రరూపం) చేసే ‘కీ’ నిర్మా తలకు అందిస్తారు. ఈ ‘కీ’ని వాడుకునే థియేటర్ల యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శిస్తాయి. బాహుబలి–2 నిర్మాతలు ఆరుగురు బ్రాడ్‌కాస్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిలో యూఎండబ్ల్యూ డిజిటల్‌ సర్వీసెస్‌ ఒకటి. 
 
గతంలో ఈ సంస్థలో మోను అలియాస్‌ అంకిత్‌ కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. థియేటర్‌లోని సర్వర్‌లో సినిమా కాపీ అవుతుందని తెలుసుకున్నాడు. దీంతో బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని బిహార్‌కు చెందిన దివాకర్‌ను సంప్రదించాడు. అతడి థియేటర్‌లోనే సర్వర్‌కు ఓ ల్యాప్‌టాప్‌ అనుసంధానించి చిత్రానికి సంబం ధించిన హెచ్‌డీ ప్రింట్‌ను వాటర్‌మార్క్‌తో పాటు కాపీ చేశాడు. ఈ కాపీని వినియోగించి వీలున్నంత సంపాదించడానికి పట్నాకు చెందిన చందన్‌కు సమాచారం ఇచ్చాడు.
 
2015లో విడుదలైన బాహుబలి చిత్రం సైతం పైరసీకి గురైంది. నిర్మాతల ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఢిల్లీకి చెందిన రాహుల్‌ మెహతాతో పాటు అతడి అనుచరులు జితేందర్‌కుమార్‌ మెహతా, తౌఫీఖ్, మహ్మద్‌ అలీల్ని అరెస్టు చేశారు. వీరి ద్వారానే బాహుబలి–2 కాపీని కూడా క్యాష్‌ చేసుకోవాలని భావించిన చందన్‌ విషయం వారికి చెప్పాడు. దీంతో రాహుల్‌ రంగంలోకి దిగాడు.
 
హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌ నిర్మాతలైన ఆర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం హెచ్‌డీ ప్రింట్‌ ఉందని.. సినిమా ప్రదర్శితమైనన్ని రోజులూ వారానికి రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్‌లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఫిర్యాదును అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌భాష నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి మూలాలు కనుగొంది. ఢిల్లీ, బిహార్‌ల్లో వరుసదాడులు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీ, దివాకర్, చందన్‌లను అరెస్టు చేశారు.
                
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సినిమా కీ పంపిణీలో చిన్న లోపాన్ని పసిగట్టి సినిమానే కాపీ చేసిపడేసిన ఈ ఘనులు నిర్మాతలకు నేరుగా ఫోన్ చేస్తే అడ్డంగా బుక్ అవుతామన్న చిన్న విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయారంటే తెలివి ఎప్పుడూ నీ సొత్తుగానే ఉండిపోదు అనే నానుడి నిజమే అనిపిస్తుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments