Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే స‌మ‌స్యే క్రేజీ ఫెలోః దర్శకుడు ఫణి కృష్ణ

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (16:06 IST)
director Fani Krishna
ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా దర్శకుడు ఫణి కృష్ణ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
- దేళ్ళుగా ఇండస్ట్రీలో వున్నాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశాను. కొన్ని చిన్న సినిమాలకు పని చేశాను. కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర రచన విభాగంలో కూడా చేశాను. క్రేజీ ఫెలో కథ రాధమోహన్ గారికి చెప్పాను. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి రావడం అనందంగా వుంది.
 
- క్రేజీ ఫెలో క్యారెక్టర్ బేస్డ్ మూవీ. హీరో పాత్రని చాలా క్రేజీ గా డిజైన్ చేశాం. చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ని హిలేరియస్ గా చూపించాం. చాలా మంచి వినోదం వుంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఎప్పుడూ వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతాను. ఆది గారిని ఫుల్ లెంత్ లవ్ ఎంటర్ టైనర్ లో చూసి చాలా కాలమైయింది. క్రేజీ ఫెలో తప్పకుండా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మంచి చిరునవ్వుతో బయటికి వస్తారు.
 
- ఆది ఇందులో కొత్తగా వుంటారు. ఆయన నటన కూడా కొత్తగా వుంటుంది. ఒక కొత్త ఆదిని చూస్తారు. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఇందులో యాక్షన్ కూడా వుంది. అయితే ఇందులో విలన్ కూడా హీరోనే. అతని వలన అతనికే సమస్యలు( నవ్వుతూ). చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటుంది.
 
- మంచి సినిమాకి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వస్తారని నమ్ముతాను. సినిమా బావుందని తెలిస్తే మాత్రం తప్పకుండా  థియేటర్ కి వస్తారు. క్రేజీ ఫెలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు మంచి సినిమా చుశామనే ఫీలింగ్ తో బయటికి వస్తారు. ఆది గారికి ఖచ్చితంగా విజయం వస్తుందని నమ్ముతున్నాను.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments