లేటు వయస్సులో జితేంద్రకు కొత్త చిక్కు.. హోటల్‌లో రేప్ చేశాడట..

బాలీవుడ్ నటుడు జితేంద్ర లేటు వయస్సులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 50 సంవత్సరాల క్రితం ఓ హోటల్‌లో తనను వేధించారని బాధితురాలు హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు లేఖ రాసింది. అంతేగాకుండా కేసు నమోదు

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:11 IST)
బాలీవుడ్ నటుడు జితేంద్ర లేటు వయస్సులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 50 సంవత్సరాల క్రితం ఓ హోటల్‌లో తనను వేధించారని బాధితురాలు హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు లేఖ రాసింది. అంతేగాకుండా కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు రెండు పేజీల లేఖ రాసింది. అయితే ఇవి బేస్‌లెస్ ఆరోపణలంటూ నటుడి తరపు న్యాయవాది కొట్టిపారేశారు.
 
50 ఏళ్ల క్రితం ఓ హోటల్‌లో తనను జితేంద్ర లైంగికంగా వేధించారని బాధితురాలు ఆ లేఖలో పేర్కొంది. అప్పట్లో 28 ఏళ్ల వయస్సున్న జితేంద్ర 18 ఏళ్ల వయసున్న తనను లైంగికంగా వేధించారని లేఖలో బాధితురాలు పేర్కొంది. అయితే బాధితురాలి ఆరోపణలను జితేంద్ర తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. ఇదో అర్థం పర్థం లేని ఆరోపణ అంటూ తోసిపుచ్చారు. 
 
1971లో ఓ షూటింగ్‌లో భాగంగా జితేంద్ర తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. షూటింగ్ స్పాట్ నుంచి కారులో ఎక్కించుకుని ఢిల్లీ నుంచి ఓ హోటల్‌కు తీసుకెళ్లారని.. వేర్వేరు పడకలు ఉండగా అక్కడే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాగా అలసిపోయిన తాను తనువు మరిచి నిద్రపోయానని.. అయితే కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూసేలోపు జితేంద్ర తన పడకపై తనపక్కనే వున్నారని తెలిపింది. 
 
ఇంకా అతడి నుంచి మద్యం వాసన వచ్చిందని ఆ లేఖలో బాధితురాలు చెప్పుకొచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని.. ఆ రాత్రికి తనను అక్కడే వదిలి జితేంద్ర వెళ్లిపోయారని ఆరోపించింది. ఇలా జితేంద్రపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలు ఆయనకు దగ్గర బంధువని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం