Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని ప్రజెంట్స్ లో కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ చిత్రం గ్రాండ్ లాంచ్

డీవీ
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (15:30 IST)
Prashanti, nani, shivaji, priyadarshi
హీరో నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో ఈరోజు, ప్రియదర్శి లీడ్ రోల్ లో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న న్యూ మూవీని అనౌన్స్ చేశారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. 
 
బోనులో న్యాయదేవత, శాంతి చిహ్నాలు గా ఎగురుతున్న పావురాలు వున్న టైటిల్ లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
 
ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రియదర్శిపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్‌ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.
 
ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రనీ పని చేస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్. దర్శకుడు రామ్ జగదీష్‌తో పాటు కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి స్క్రీన్ ప్లే రాశారు.
 
తారాగణం: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments