Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ టీమ్‌లో కరోనా, ఇది నిజమేనా..?

Webdunia
శనివారం, 4 జులై 2020 (13:23 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా టైమ్‌లో కూడా వరుసగా సినిమాలు తీస్తూ... వాటిని ఓటీటీలో రిలీజ్ చేస్తూ... సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. క్లైమాక్స్, నగ్నం చిత్రాలను రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. 12 ’o’ CLOCK అంటూ భయపెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
 
ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే... చాలా సంవత్సరాల తర్వాత వర్మ మనసు పెట్టి సినిమా తీసారనిపిస్తుంది. ఈ మూవీకి స్వరవాణి కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇదిలా ఉంటే... వర్మ టీమ్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని.. అందుచేత వర్మ తన వర్క్ అంతా ఆపేసారని వార్తలు వచ్చాయి.
 
ఆ వార్తలపై వర్మ స్పందిస్తూ... టీమ్ మెంబర్స్ అందరికీ కరోనా టెస్ట్‌లు చేసిన తర్వాత నెగిటివ్ అని వచ్చింది. అప్పుడు వర్క్ స్టార్ట్ చేసాం. మా టీమ్ మెంబర్స్‌కి కరోనా వచ్చిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కరోనా కారణంగా సినీ ప్రముఖులు షూటింగ్‌లు ఆపేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తూ... ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే... కరోనా టైమ్‌ని ఓటీటీని ఫ్లాట్ఫామ్‌ని తనదైన స్టైల్లో ఉపయోగించుకుంటూ మరోసారి తనక తానే సాటి అని నిరూపించారు రామ్ గోపాల్ వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం