Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్స్‌కి కొత్త రూల్స్, ఇదే జరిగితే.. సినీ ప్రియులకు పండగే..!

Webdunia
సోమవారం, 11 మే 2020 (19:47 IST)
కరోనా కారణంగా సినిమా హాల్స్ మూసివేసిన విషయం తెలిసిందే. థియేటర్స్ మూసేయడంతో సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారా..? అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొంతమంది జూన్, జులై వరకు థియేటర్స్ ఓపెన్ చేయరు అని చెబితే.. కొంతమంది అయితే... నవంబర్, డిసెంబర్ వరకు ఓపెన్ చేయరు అని చెప్పారు. 
 
దీంతో అప్పటివరకు థియేటర్స్ ఓపెన్ చేయరా..? అని ఫీలయ్యారు సినీ ప్రియులు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.... త్వరలోనే థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే విషయమై ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి.
 
 అయితే.. కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుందని తెలిసింది. ఇంతకీ కొత్త రూల్స్ ఏంటంటే... థియేటర్లో సీటుకు సీటు మధ్య ఒక సీటు గ్యాప్ ఇచ్చేలా.. ఏర్పాట్లు చేస్తున్నారట. 
 
అంతేకాకుండా.. ఒక షోకు మరో షోకు మధ్య 45 నిమిషాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకిలా చేస్తున్నారంటే... షో కంప్లీట్ అయిన తర్వాత థియేటర్లోని అన్ని సీట్లను శానిటైజ్‌ చేసి ఎర్ర రిబ్బన్‌ పెట్టాలని.. దీనికి ఎక్కువ టైమ్ అయితే రోజుకు నాలుగు షోలకు బదులు మూడు షోలనే ప్రదర్శించాలని అనుకుంటున్నారట. త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం. మరి... థియేటర్ ఓపెన్ చేస్తే... ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments