Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వల్లే వివేక్ మృతి : మన్సూర్ అలీఖాన్

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (15:56 IST)
కరోనా టీకా కారణంగానే నటుడు వివేక్‌ మృతిచెందారని, ఆయన కరోనా టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ప్రశ్నిస్తున్నారు. అసలు కరోనా టీకాలు ఎవరు చెప్పారనీ, ప్రజలు డిమాండ్ చేసారా అని నిలదీశారు. 
 
శనివారం వివేక్‌ భౌతికకాయానికి అంజలి ఘటించిన అనంతరం ఆయన భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు. 'కరోనా కేసుల సంఖ్య పత్రికల్లో వేయడం నిలిపివేయండి. ఎందుకు ప్రజలను భయపెడుతూ చంపుతున్నారు? అడిగేవారు లేరనేనా? దేశంలో కరోనా పరీక్షలు నిలిపివేయండి, మరుసటిరోజే దేశంలో కరోనా ఉండదు. 
 
వివేక్‌ బాగానే ఉన్నాడుగా, ఎందుకు కరోనా టీకా వేశారు? ఆ టీకాలో ఎలాంటి సామర్ధ్యం ఉంది? దేశంలో కరోనా లాంటి వైరస్‌లు చాలా ఏళ్లుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. టీకాతోనే వివేక్‌ మరణించలేదని ఎలా నిర్ధారిస్తారు? ఎవరు చెబుతారు? 
 
తొండాముత్తూరు నియోజకవర్గంలో పోటీచేసిన నేను ప్రచారంలో భిక్షగాళ్ల పక్కన, కుక్క పక్కన కూడా కూర్చున్నాను. నాకు కరోనా రాలేదే? మాస్క్‌లు వేసుకోమని ఎందుకు చెబుతున్నారు? మనం వదిలే గాలి చెడ్డగాలి అని చెబుతున్నారు. మరి మాస్క్‌ వేసుకొంటే చెడ్డగాలిని మళ్లీ పీల్చాల్సి వస్తుందిగా? మాస్క్‌లు వేసుకోలేదని జరిమానా విధిస్తున్నారు. 
 
కరోనా లేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. నన్ను తీసుకెళ్లి జైలులో వేయండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. షూటింగ్‌లకు కరోనా సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడంతో, ఈ టెస్ట్‌కు రూ.2 వేలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది. అంత స్థోమత లేని జూనియర్‌ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయి రోడ్లపై పడ్డారు. కరోనా... కరోనా... అంటారా? పనులు కోల్పోయిన ఇబ్బంది పడుతున్న ప్రతి రేషన్‌కార్డుకు రూ.1 లక్ష ఇవ్వండి. 
 
కరోనా టీకా వేయించుకొనే వారందరికి ఇన్యూరెన్స్‌ ఇవ్వండి. వ్యాధి నిరోధక శక్తి పెంచేలా పారంపర్యమైన మూలికల కషాయాలను ప్రజలకు ఉచితంగా, విరివిరిగా అందించండి. కరోనా పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయి. ఇది ఏమాత్రం సరి కాదు. 
 
పరిష్కారించాల్సిన చోట సమస్యను పెంచుతున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలను చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ఖండించారు. వివేక్‌ మృతికి, కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అలాగే తప్పుడు ప్రచారం చేసినందుకు డీజీపీకి మన్సూర్ అలీఖాన్‌పై ఫిర్యాదు కూడా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments