Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా ఎఫెక్ట్ `ఆచార్య' షూటింగ్ బ్రేక్!

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (18:53 IST)
Acharya set
ఇటీవ‌ల క‌రోనా సెకండ్‌వేవ్ హైద‌రాబాద్‌లోనూ వ్యాపించింది. సినీప్ర‌ముఖుల‌కు క‌రోనా పాజిటివ్ కూడా వ‌చ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా `ఆచార్య‌` షూటింగ్‌కు ఆ సెగ త‌గిలింది. వారం క్రితం సోనూసూద్ ఆ సినిమా షూటింగ్ నిమిత్తం సైకిల్‌పై కోకాపేట వెళ్ళారు. ఆ మ‌రుస‌టిరోజు త‌న‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ‌లో ఆచార్య సినిమా షూటింగ్ బ్రేక్ ప‌డింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత రోజు కూడా షూటింగ్ య‌థావిధిగా జ‌రిగింది. ప‌రిమిత స‌భ్యులు, టెక్నీషియ‌న్స్ ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. కాగా, సోమ‌వారంనాడు కోకాపేట‌లో ఆచార్య సెట్ బోసిబోయింది. ఈ విష‌యమై చుట్టుప‌క్క‌ల‌వారి స‌మాచారం మేర‌కు షూటింగ్ క‌రోనా వ‌ల్ల బ్రేక్ ప‌డింద‌ని తెలియ‌జేశారు.
 
సోమ‌వారం సాయంత్రానికి 'ఆచార్య' షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ను దర్శక నిర్మాతలు ప్రకటించినట్లుగా తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments