ప్రభాస్ నటిస్తున్న `రాధేశ్యామ్`కు అడుగడుగునాఅడ్డంకులు వస్తూనే వున్నాయి. ముహూర్త బలం అన్నీ చూసుకుని షూటింగ్ చేసే ఆనవాయితీ వున్న సినిమారంగంలో షూటింగ్‌లోనే కొన్నిసార్లు అపశృతులు, అడ్డంకులు కలుగుతుంటాయి. ఈ సినిమా ఇటలీలో షూటింగ్ జరుగుతుండగా కరోనా వచ్చి షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత లాక్‌డౌన్ అయ్యాక కొంత గేప్ రావడంతో మరలా షూటింగ్ పెట్టారు. అప్పటిలో వున్న మూడ్ కానీ, ఎనర్జీకానీ లేవని చిత్రయూనిట్ ఈ సినిమా కొంత భాగాన్ని మరలా రీ ష్యూట్ చేసిందనే వార్తలు వినిపించాయి. ఇంకోవైపు ఈమధ్య ఓ పాటను తీయాలనుకుంటే పూజా హెగ్డే కరోనా ఉదృతితోపాటు డేట్ కుదరక నో చెప్పింది. ఇంకోవైపు కృష్ణంరాజు ఎపిసోడ్ షూట్ చేయాలనుకుంటే కరోనా వల్ల ఆయన ఆరోగ్యం గురించి వాయిదా వేశారు.
ఇక ఆ తర్వాత ప్రభాస్ ముంబైలో ఇల్లు తీసుకోవడం, ఆ తర్వాత మరో రెండు సినిమాలలో చేయడానికి అంగీకారం తెలపడంతో ఆ కథలు వినే పనిలో కొంత ఆలస్యమైంది. ఈలోగా కరోనా రెండో వేవ్ కొనసాగడంతో బాలీవుడ్లో షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఏవిధంగానైనా జూలై నాటికి సినిమా విడుదలకు నిర్మాతలు సిద్ధం చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల థియేటర్లు 50శాతం ఆక్యెపెన్సీకింద వుండేలా రూల్ వస్తుందనే వార్త ప్రబలంగా వుంది. నేడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారం లాక్‌డౌన్ మరలా రిపీట్ అవుతుందనే టాక్ ఫిలింనగర్‌లో ప్రబలంగా వుంది.
కరోనా వల్ల సాయంత్రంపూట జరిగే ఏ వేడుకలకు జనాలు రావడంలేదు. మీడియా కూడా అంతంత మాత్రంగా వుంది. దాంతో కొన్ని ఫంక్షన్లు జరిపాం అనిపించేలా చేస్తున్నారు. కనుక మరలీ 2020లో సినిమా కు బ్రేక్ పడుతుందేమోనని ఆలోచనలో నిర్మాతలున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదల తేదీలు వాయిదా వేసుకున్నారు. ఆచారి సినిమా కూడా షూటింగ్ వాయిదా పడింది. ఈ లెక్కన రాధేశ్యామ్ విడుదల చేయడానికి కరోనా మహమ్మారే దారి చూపాలని భావిస్తున్నారు.