Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌లో మా వివాహం.. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.. చైతూ

ప్రముఖ యువనటులు నాగచైతన్య, సమంత వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 6న వివాహంతో వీరిద్దరూ దంపతులు కానున్నారని వార్తలు వస్తున్నాయి. రారండోయ్ వేడుక చూద్దాం.. సినిమా ప్రమోషన్ సందర

Webdunia
సోమవారం, 22 మే 2017 (11:57 IST)
ప్రముఖ యువనటులు నాగచైతన్య, సమంత వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 6న వివాహంతో వీరిద్దరూ దంపతులు కానున్నారని వార్తలు వస్తున్నాయి. రారండోయ్ వేడుక చూద్దాం.. సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. తమ వివాహం అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఉంటుందని చెప్పారు. కానీ డేట్ ఇంకా అనుకోలేదని చైతూ వెల్లడించారు.
 
ఇకపోతే.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్యపై అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించారు. తండ్రిగా కాదు.. సినీ నిర్మాతగా చెప్తున్నా.. తన హీరో (చైతూ) సూపర్ అంటూ కుమారుడిపై నాగ్ కొనియాడారు. 
 
ఈ చిత్రం ఆడియో సీడీలను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమాలో చక్కటి పల్లెటూరి పిల్లలాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుందని కితాబిచ్చారు. రారండోయ్ సినిమా ద్వారా తప్పకుండా హిట్ కొడతామని నాగ్ వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments