నా కుమార్తె పెళ్ళికి పవన్ ఎందుకు రాలేదంటే... నటుడు అలీ వివరణ

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:52 IST)
హాస్య నటుడు అలీ కుమార్తె పెళ్లి ఇటీవల హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ఉన్నారు. అయితే, పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం హాజరుకాలేదు. దీనిపై పలు రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం పవన్ కళ్యాణ్‌కు అలీకి మధ్య ఎంతో అనుబంధం ఉంది. పవన్ ప్రతి సినిమాలో అలీకి ఖచ్చితంగా పాత్ర ఉండేది. అయితే, గత ఎన్నికల సమయంలో ఇద్దరికీ మధ్య గ్యాప్ వచ్చింది. వైకాపాలో అలీ చేరడంతో ఇద్దిర మధ్య గ్యాప్ నిజమేనని ప్రతి ఒక్కరూ భావించారు. తాజాగా అలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గ్యాప్‌పై క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య గ్యాప్, వివాదం ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కొన్ని వెబ్‌సైట్స్ పనికట్టుకుని ఈ ప్రచారం చేశాయని మండిపడ్డారు. 
 
ఇటీవల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి పవన్ నటిస్తున్న సినిమా సెట్‌కు వెళ్లానని తాను వచ్చిన విషయం తెలుసుకుని ఆయన తన వద్దకు వచ్చారని అలీ చెప్పారు. అదేసమయంలో ఆయనను కలవడానికి వేరే వాళ్లు వచ్చినా వారిని వెయిట్ చేయించారని, ఆ సమయంలో తామిద్దరం దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నామని, మేమిద్దం ఏం మాట్లాడుకున్నది ఆ వెబ్‌సైట్ వారికి తెలియదు కదా అంటూ అలీ ప్రశ్నించారు. వెబ్ సైట్ వ్యూస్ కోసం ఇలాంటి పుకార్లు పుటిస్తారని అలీ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments