Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ బాటలో అలీ.. 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులు

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:43 IST)
Ali
స్టార్ హీరో సోనూసూద్‌ను చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. తాజాగా అలీ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఆర్థికంగా నష్టపోయారు. దీంతో పూట కూడా గడవడం చాలా కష్టంగా ఉన్న వారు అనేక మంది ఉన్నారు. సినీ పరిశ్రమలోనూ షూటింగ్‌కు వెళ్తేనే రోజు గడుపుకునే వారు ప్రస్తుతం షూటింగ్స్ లేక రోజువారీ సరుకులు కొనుగోలు చేయలేనంత ఇబ్బందుల్లో ఉన్నారు. 
 
అటువంటి వారికి చేయూతగా సోనూసూద్ లాంటి వ్యక్తులు నిలుస్తుంటే.. తన శక్తి మేర ప్రముఖ నటులు అలీ కూడా ముందుకొచ్చారు. తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మంది మహిళలకు తన భార్య జుబేదా చేతుల మీదుగా నిత్యావసర సరుకులు సాయంగా అందించారు.
 
మా కన్నా ముందే లొకేషన్‌లో ఉండే లేడీస్ సెట్‌లో అందరూ తినే ప్లేట్స్, కప్పులు శుభ్రం చేస్తుంటారు. లాక్‌డౌస్ వలన వారంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. తన వంతు సాయంగా రూ. 2 లక్షలతో సాయం చేయాలని నిర్ణయించుకున్నా అని అలీ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments