Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదో ఆశించి అవ‌కాశాలు ఇవ్వ‌బోయార‌ు : 'కాస్టింగ్ కౌచ్'పై స్వాతి

"క‌ల‌ర్స్" అనే కార్యక్రమం తర్వాత బాగా పాపులర్ అయిన తెలుగమ్మాయి స్వాతి. ఆ తర్వాత 'ఆష్టాచెమ్మా' సినిమాతో హీరోయిన్‌గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈమె వెండితెర అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే ఈమెపై వచ్చ

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (17:13 IST)
"క‌ల‌ర్స్" అనే కార్యక్రమం తర్వాత బాగా పాపులర్ అయిన తెలుగమ్మాయి స్వాతి. ఆ తర్వాత 'ఆష్టాచెమ్మా' సినిమాతో హీరోయిన్‌గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈమె వెండితెర అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే ఈమెపై వచ్చినన్ని గాసిప్స్ మరేయితర హీరోయిన్లపై రాలేదని చెప్పొచ్చు. కలర్స్ స్వాతి ఏకంగా బ్లూఫిల్మ్‌లో కూడా నటించిందనే వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెల్సిందే.
 
తాజాగా ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి, ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ గురించి మాట్లాడింది. వీటన్నింటిపై ఆమె ఇపుడు మనసువిప్పి మాట్లాడారు. 'అల్ల‌రి న‌రేష్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్‌. అత‌నితో నాకు అఫైర్ అంటూ వ‌చ్చిన ఓ వార్త న‌న్ను షాక్‌కు గురి చేసింది. ఆ వార్త చ‌ద‌వి చాలా బాధ‌ప‌డ్డా. అలాగే నిఖిల్‌కు, నాకు కూడా అఫైర్ ఉంద‌ని రాసేశారు. ఆ వార్త వ‌ల్ల మా ఇద్ద‌రం చాలా ఇబ్బంది ప‌డ్డాం. ఆ త‌ర్వాత నాని, దేవి శ్రీప్ర‌సాద్‌, సునీల్‌.. ఇలా అంద‌రితో ముడిపెడుతూ నా పేరు రాశారు. అప్పుడూ చాలా బాధ‌ప‌డ్డాన'ని స్వాతి చెప్పుకొచ్చింది.
 
అంతేకాకుండా, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన "క‌థ, స్క్రీన్‌ప్లే, అప్ప‌ల్రాజు" సినిమాలో నటిస్తానని ఒప్పుకున్నందుకు చాలా మంది న‌న్ను తిట్టారు. ఆయ‌న గురించి కొంత‌మంది చెడుగా చెప్పారు. న‌న్ను చాలా భ‌య‌పెట్టారు. కానీ, ఆయ‌న ఓ జెంటిల్మెన్‌. గొప్ప జీనియస్‌" అని స్వామి చెప్పుకొచ్చింది. అలాగే సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. త‌నూ అలాంటి వేధింపులు ఎదుర్కొన్నాన‌ని చెప్పింది. కొంద‌రు త‌న నుంచి ఏదో ఆశించి అవ‌కాశాలు ఇవ్వ‌బోయార‌ని, అలాంటి వాటిని తాను తిర‌స్క‌రించాన‌ని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments