Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ.. సిటీ న్యూరో సెంటర్ ప్రకటన

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:31 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీతో చికిత్స చేస్తున్నట్టు ఆయనకు వైద్యం చేస్తున్న సినీ న్యూరో సెంటర్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 
 
కరోనా వైరస్ బారినపడిన రాజశేఖర్‌ను హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సిటీ న్యూరో సెంటర్ వర్గాలు హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశాయి. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ బులెటిన్‌లో రాజశేఖర్ ఆరోగ్య వివరాలు తెలిపారు.
 
నటుడు రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ, సైటోసార్బ్ థెరపీ ఇస్తున్నామని వివరించారు. రాజశేఖర్‌ను తమ వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ రత్నకిశోర్ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments