Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భార్యను అత్యాచారం చేస్తాను.. బెదిరించిన వ్యక్తి ఎవరు?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (19:32 IST)
Padmapriya
చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో సినిమాటోగ్రాఫర్ భార్యను అత్యాచారం చేస్తానని ఒక మలయాళ డైరెక్టర్ బెదిరించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎంఎస్ ప్రభు సీనియర్ సినిమాటోగ్రాఫర్. 30 ఏళ్లుగా ఎన్నో సినిమాలకు పనిచేస్తున్నాడు. ఇక ఇతనికి 2016లో సూర్య అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. 
 
ఇతను హీరోయిన్ పద్మప్రియతో ఒక భారతీయార్ వీడియో సాంగ్ చేయాలనీ చెప్పి ప్రభును అడుగగా.. ఆయన అదేవిధంగా వీడియో తయారుచేసి ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నిరోజులు సూర్య, పద్మప్రియ ఫోన్ నెంబర్ కావాలని ప్రభును ఒత్తిడిచేయడం మొదలుపెట్టాడు. అయితే హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో డైరక్టర్ ప్రభును బెదిరించాడు. 
 
హీరోయిన్ నెంబర్ ఇవ్వకపోతే.. "నీ భార్యను అత్యాచారం చేస్తాను" అని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన ప్రభు.. వెంటనే రామాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో సూర్య అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. 
 
నటి పద్మప్రియ ను పరిచయం చేయాల్సిందిగా, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా తనను బెదిరిస్తున్నాడని.. నెంబర్ ఇవ్వకపోతే తన భార్యను అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నాడు. దయచేసి అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments