Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో తెరుచుకున్న థియేటర్లు.. నేడు మూడు సినిమాలు రిలీజ్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (12:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు క్రమంగా కరోనా నిబంధనలను సడలిస్తున్నాయి. అలాగే, తెలంగాణ ప్రభుత్వం దశల వారీగా ఒక్కోదానికి అనుమతినిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి కూడా అనుమతించింది. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేందుకు టీఎస్ ప్రభుత్వం అనుమతించింది. 
 
పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో థియేటర్లను పునఃప్రారంభించడానికి యాజమాన్యాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. 
 
కాగా, గత ఏప్రిల్ నెలలో 'వకీల్ సాబ్' థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూత పడ్డాయి. ఈరోజు సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు', తేజ సజ్జ నటించిన 'ఇష్క్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే, వకీల్ సాబ్ కూడా మళ్లీ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments