Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘చిత్రాంగద’

ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ‘చిత్రాంగద’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ‘చిత్రాంగద’ పేరుతో.. తమిళంలో ‘యార్నీ’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి ‘పిల్ల జమీందార్’

Webdunia
శనివారం, 9 జులై 2016 (19:33 IST)
ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ‘చిత్రాంగద’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ‘చిత్రాంగద’ పేరుతో.. తమిళంలో ‘యార్నీ’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేస్తాయి. ఇప్పటివరకు కథానాయిక అంజలి తన కెరీర్‌లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను ‘చిత్రాంగద’లో పోషిస్తుంది. అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది. 
 
టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్‌లో కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు అమెరికాలో జరుగుతున్నాయి. గ్రాఫిక్స్‌కి అత్యంత ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో.. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా రావాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అందువల్లే మూవీ ఆలస్యం అవుతోంది. అతి త్వరలో ఆడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
  
అంజలి, జెపి, సప్తగిరి, రాజా రవీంద్ర, సిందుతులానీ, రక్ష, దీపక్, సాక్షి గులాటి, జబర్దస్త్ సుదీర్, జ్యోతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్,  ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి (హైద్రాబాద్) మరియు జేమ్స్ క్వాన్, రోడిన్ (USA ), సమర్పణ: TCS రెడ్డి, వెంకట్ వాడపల్లి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి
అన్నీ చూడండి

తాజా వార్తలు

జంతువుల కొవ్వు, చేప నూనె.. తిరుపతి లడ్డూపై బండ్ సంజయ్ ఏమన్నారు?

పాట్నా ఎన్ఐటీ‌లో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

గంజాయి స్మగ్లింగ్.. భార్యగా నటించేందుకు మహిళను అద్దెకు తీసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments