Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌కు పెద్ద చాక్లెట్ పంపిన వై.ఎస్. భారతి.. ఎందుకో తెలుసా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడి దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని ఐదో నింద

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (17:16 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడి దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని ఐదో నిందితురాలిగా పేర్కొనడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.


ఇటీవల మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద రఘురాం సిమెంట్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేక కోర్టు హోదా కలిగిన సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని ఈడీ దాఖలు చేసింది.
 
అయితే ఇప్పటి వరకు అక్రమాస్తుల కేసుల వ్యవహరంలో సిబిఐ దాఖలు చేసిన 12 అభియోగపత్రాల్లో భారతి పేరు ఎక్కడా లేకపోగా తొలిసారి ఈడి దాఖలు చేసిన ఫిర్యాదుతో ఆమె పేరు బయటకు వచ్చింది. 
 
ఇలా వార్తల్లోకెక్కిన వై.ఎస్. భారతి ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవికి భారతి ఓ పెద్ద చాక్లెట్ పంపారు. ఎందుకంటే..? మెగాస్టార్ పుట్టినరోజు కోసం కానేకాదు. ఇటీవల భారతి సొంత ఛానల్ ఓ అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో జీవిత సాఫల్య పురస్కారం, బెస్ట్ యాక్టర్ వంటి పలు అవార్డుల ప్రదానం జరిగింది. 
 
ఇందులో భాగంగా 2017కి గాను మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150కి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. కానీ ఈ అవార్డు ఫంక్షన్‌కు మెగాస్టార్ వెళ్లలేకపోయారట. షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్.. ఆ అవార్డు ఫంక్షన్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో చిరు ఇంటికి అవార్డు తోపాటు ఒక పెద్ద.. చాక్లెట్‌ను వై.ఎస్ భారతి పంపించారు. ఇందుకు చిరంజీవి వై.ఎస్. భారతికి కృతజ్ఞతలు తెలిపారు. ''నా సోదరి పంపిన ఈ అవార్డును జీవితకాలం గుర్తుంచుకుంటూ'' అంటూ చిరంజీవి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments