Webdunia - Bharat's app for daily news and videos

Install App

చవితి రోజున మెగా ఫ్యాన్స్‌కు పండగే... చిరు మూవీ 152 ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:45 IST)
ఈ నెల 22వ తేదీన వినాయక చవితి పండుగ. దీనికితోడు మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టిన రోజు. ఒకవైపు పండుగ, మరోవైపు తమ అభిమాన హీరో బర్త్‌డే. ఇక మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దే ఉండదు. దీనికితోడు ఆ రోజు మరో మెగా సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. 
 
ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మెజార్టీ భాగం షూటింగ్ పూర్తిచేసుకోగా, మరో షెడ్యూల్ మాత్రమే మిగిలివుంది. పైగా, ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో లాక్డౌన్‌తో ఆల‌స్య‌మైన చిరు 152వ చిత్రం నుంచి ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. 
 
ఈ మూవీ ఫస్ట్‌లుక్ తోపాటు, మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ సిద్ధమైపోయింది. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను అంద‌రినీ అల‌రించ‌డం ఖాయ‌మైన‌ట్టే. 
 
2021లో ఈ మూవీ విడుద‌ల కానుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తోన్న ఈ మూవీని సురేఖా కొణిదెల స‌మ‌ర్పిస్తుండ‌గా.. ప్రముఖ నిర్మాత నిరంజ‌న్ రెడ్డి, చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments