Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు టైటిల్ ఇదే.. "ఖైదీ నెంబర్ 150"

మెగాస్టార్ అభిమానులకో శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150వ సినిమాకు టైటిల్ ఖరారైంది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిప

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2016 (17:41 IST)
మెగాస్టార్ అభిమానులకో శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150వ సినిమాకు టైటిల్ ఖరారైంది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే "ఖైదీ నెంబర్ 150" అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు తెలిసింది.
 
ఇక చిరంజీవి 150వ సినిమాను వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా గబ్బర్ సింగ్ 2లో పవన్ కల్యాణ్‌తో జతకట్టిన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఖరారైంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments