Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి వార్‌లో 15 సార్లు తలపడిన చిరంజీవి - బాలకృష్ణ... పైచేయి ఎవరిది?

సంక్రాంతి కురుక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణలు మరోమారు తలపడనున్నారు. ఇప్పటివరకు 15 సార్లు వీరిద్దరు తలపడ్డారు. ఇపుడు 16వ సారి మరోమారు అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అదీ కూడా ఓ

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (12:13 IST)
సంక్రాంతి కురుక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణలు మరోమారు తలపడనున్నారు. ఇప్పటివరకు 15 సార్లు వీరిద్దరు తలపడ్డారు. ఇపుడు 16వ సారి మరోమారు అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. (వీరబ్రహ్మేంద్ర స్వామి - అగ్నిగుండం చిత్రంతో కలుపుకుంటే ఈ సంఖ్య 17గా ఉంది. అయితే, సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రంలో బాలకృష్ణ సిద్ధయ్య పాత్రను మాత్రమే పోషించాడు. అంటే పూర్తి స్థాయి హీరో కాదు). అదీ కూడా ఓ దశాబ్దన్నరకాలం తర్వాత వీరిద్దరి చిత్రాలు సంక్రాంతి బరిలో ఉండటంతో ఇపుటు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, ఇప్పటివరకు సంక్రాంతి రేస్‌లో నిలిచిన చిరంజీవి బాలకృష్ణలకు చెందిన చిత్రాల వివరాలను పరిశీలిస్తే...
 
1984 జనవరి నెలలో మంగమ్మగారి మనువడు - ఇంటిగుట్టు. 1984 డిసెంబర్ నెలలో కథానాయకుడు - రుస్తుం చిత్రాలు విడుదలయ్యాయి. 1985లో ఆత్మబం - చట్టంతో పోరాటం, 1986లో నిప్పులాంటి మనిషి - కొండవీటిరాజా, 1986లో అపూర్వసహోదరులు - రాక్షసులు, 1987లో భార్గవరాముడు - దొంగమొగుడు, 1987లో రాము - పసివాడి ప్రాణం, 1988లో ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ - మంచిదొంగ, 1988లో రాముడుభీముడు - యుద్ధభూమి, 1997లో పెద్దన్నయ్య - హిట్లర్, 2000లో వంశోద్ధారకుడు - అన్నయ్య, 2001లో నరసింహనాయుడు - మృగరాజు, 2001లో భలేవాడివి బాసు - శ్రీమంజునాథ, 2004లో లక్ష్మీనరసింహా - అంజి చిత్రాలు విడుదల కాగా, ఈ సంక్రాంతి రేసులో 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి - ఖైదీ నంబర్ 150లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో వెండితెరపై ప్రదర్శితం కానున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments