Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళా శంకర్ నుంచి చిరంజీవి వింటేజ్ లుక్ పోస్టర్స్

Webdunia
సోమవారం, 1 మే 2023 (13:13 IST)
Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్  మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తి చేసారు. దానితో 80% షూటింగ్ పూర్తయింది.
 
మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగాస్టార్ గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్ లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు.  ఛార్మింగ్ స్మైల్ తో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు మెగాస్టార్.
 
చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, వెన్నెల కిషోర్, ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోల్‌కత్తాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. మహతి స్వర సాగర్ రాకింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
 
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌ సమపాళ్లలో వుండనున్నాయి.
 
 తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్,  చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.
 
ఈ చిత్రానికి డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.  
 
తారాగణం:  చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేక వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష ,ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు , తాగుబోతు రమేష్ ,రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షహ్వర్ అలీ & తరుణ్ అరోరా
 
సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఇకపై సీసీటీవీ నిఘా నీడలో సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments