Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా' సీక్రెట్స్ వెల్లడించిన చిరంజీవి...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గత యేడాది డిసెంబరు ఆరో తేదీన సెట్స్ పైకెళ్లి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ ప్రారంభంకావాల్సి ఉంది.

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (12:40 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గత యేడాది డిసెంబరు ఆరో తేదీన సెట్స్ పైకెళ్లి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ ప్రారంభంకావాల్సి ఉంది. 
 
చిరు కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్మాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ జ‌రుపుకోగా, ఫిబ్ర‌వ‌రిలో రెండో షెడ్యూల్‌కి సిద్ధ‌మైంది. ఈ విష‌యాన్నిచిరు స్వ‌యంగా వెల్లడించారు. 
 
స్టైలిష్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సైరా తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం రూపొందుతోంది. 
 
దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం పొలాచ్చి, రాజస్థాన్‌లతో పాటు ప‌లు ప్రాంతాలలోను షూటింగ్ జ‌రుపుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments