Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' థ్యాంక్స్ మీట్... పర్మిషన్ లభించేనా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైన కలెక్షన్ల కుమ్మేస్తోంది. ఫలితంగా కేవలం ఏడు (అతితక్కువ) రోజుల్లో రూ.వంద కోట్ల క్లబ్బులో చేరిపోయిన చిత్రంగా రికార్

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (06:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైన కలెక్షన్ల కుమ్మేస్తోంది. ఫలితంగా కేవలం ఏడు (అతితక్కువ) రోజుల్లో రూ.వంద కోట్ల క్లబ్బులో చేరిపోయిన చిత్రంగా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు. ఖైదీ చిత్రానికి ఘన విజయాన్ని అందించిన అభిమానులకి కృతజ్ఞలు తెలిపేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞాభినందన (థ్యాంక్స్ మీట్) సభ ఏర్పాటు చేయనున్నట్టు అరవింద్ వెల్లడించారు. 
 
అయితే, ఈ థ్యాంక్స్ మీట్ ఎక్కడన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. వాస్తవానికి ఖైదీ ప్రీరిలీజ్ వేడుకను విజయవాడలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఏపీ సర్కారు ఒత్తిడితో విజయవాడ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో గుంటూరులోని హాయ్‌లాండ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇపుడు కూడా వైజాగ్‌లో అనుమతి లభిస్తుందా అనే ధర్మసందేహం ఉత్పన్నమైంది. 
 
ఈ నేపథ్యంలో థ్యాంక్స్ మీట్ ఎక్కడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మెగా కాంపౌడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ థ్యాంక్స్ మీట్... వైజాగ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో మెగా హీరోల సక్సెస్ మీట్లన్నీ వైజాగ్‌లో నిర్వహించారు. ఇప్పుడు మెగా ఖైదీ విషయంలోనూ అదే ఫార్ములాని ఫాలో కానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మెగా ఖైదీ విజయోత్సవేడుకపై మెగా ఫ్యామిలీ ప్రకటన చేయనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments