Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‌.. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో...

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. వారిద్దరి ఇమేజ్‌కు, భావాలకు అనుగుణంగా ఈ

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:12 IST)
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. వారిద్దరి ఇమేజ్‌కు, భావాలకు అనుగుణంగా ఈ కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి చిరు-పవన్‌ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకుల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ కల ఇపుడు నెరవేరనుంది. వాస్తవానికి గతంలో "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రంలో చిరంజీవి - పవన్ కళ్యాణ్‌లు కలిసి ఓ సన్నివేశంలో కనిపించి ఫ్యాన్స్‌ను ఆలరించారు. 
 
అయితే, చిరంజీవి తాజాగా నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి చిరంజీవి, పవన్‌లతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారంగానే ఆయన ఈ ప్రాజెక్టు గురించి గురువారం అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరు, పవన్‌లతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సుబ్బరామిరెడ్డి 'జీవనపోరాటం'(1986), 'స్టేట్‌‌రౌడీ'(1989), 'గ్యాంగ్‌ మాస్టర్'‌(1994), భగవద్గీత(1993) చిత్రాలను నిర్మించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments