Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

ఠాగూర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (10:20 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని మెగా కుటుంబం అంతా ఒక్కచోట చేరి సందడి చేసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా, మెగా హీరోల రాకతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
 
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి హాజరయ్యారు. వారితో పాటు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ కూడా సినిమా చూశారు. ముఖ్యంగా పవన్ కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య కూడా తండ్రి సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్లకు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నటులు అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ కూడా పాల్గొన్నారు.
 
ప్రస్తుతం ఈ స్పెషల్ షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి, పవన్, రామ్ చరణ్ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుండగా, ఇప్పుడు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ సినిమాకు మరింత బజ్‌ను తీసుకొచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇసుక అక్రమ రవాణాపై ఉప్పందించాడనీ కాళ్లు చేతులు విరగ్గొట్టిన వైకాపా మూకలు

పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనువు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments