Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెంటిల్మెన్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (18:01 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జెంటిల్మెన్ లుక్‌లో కనిపించారు. ఆయన నటించిన తాజా చిత్ర "భోళాశంకర్". ఈ చిత్రంలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ చూసినవాళ్లంతా ఆయనకు 67 యేళ్లు అంటే ఎవరూ నమ్మడం లేదు. ఇటీవల మరింత స్లిమ్‌గా మారిన చిరు.. కుర్రాళ్ళకు ధీటుగా ఫిట్నెస్ కాపాడుకుంటున్నారు. ఈ విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన కొత్త ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా షర్ట్, ప్యాటు, చేతికి వాచీ, కాళ్లకు హాఫ్‌ షూ ధరించిన మెగాస్టార్ "జెంటిల్మెన్" లుక్‌లో సింపుల్‌గా దర్శనమిచ్చారు. ఎంతో కూల్‌గా ఉన్న ఈ పిక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కొంతకాలం కిందట సినిమాలకు సుధీర్ఘ విరామం ఇచ్చిన చిరంజీవి.. "ఖైదీ నంబర్ 150"తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అక్కడ నుంచి ఆయన జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్నారు. "సైరా నరసింహా రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య", తాజాగా "భోళాశంకర్". మరో రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా, త్వరలోనే "సోగ్గాడే చిన్ని నాయనా" ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రంలో నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

Lokesh: జగన్ గారికి మొబైల్ కొనిపెట్టండి.. నా జేబులో నుండి 10 కోట్లు ఇస్తాను: నారా లోకేష్

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments