Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చాడు! వచ్చాడు.. సైడ్‌ ఇవ్వండి బాసు! అంటోన్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విడుదలకు ఇంకా ఏడు రోజులే వుంది. ఏడో తేదీన ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌.. గుంటూరు జిల్లాలో జరగబోతోంది. అందుకే ప్రమోషన్‌ను షురూ చేశారు. వేలాదిగా అభిమానుల్ని తరలించేందుకు ప్రణాళిక

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (11:08 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విడుదలకు ఇంకా ఏడు రోజులే వుంది. ఏడో తేదీన ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌.. గుంటూరు జిల్లాలో జరగబోతోంది. అందుకే ప్రమోషన్‌ను షురూ చేశారు. వేలాదిగా అభిమానుల్ని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్‌ మంగళవారం సభాస్థలికి వెళ్ళి పర్యవేక్షించారు. 
 
'మా' టీవీకి చెందిన సిబ్బంది తన కెమెరాలు ఎక్కడ పెటాల్లో పరిశీలిస్తున్నారు. వారంతా పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. ఎక్కడనుంచి ఊరేగింపుగా రావాలో.. ఎక్కడ ఆంక్షలు వుంటాయో విధిగా ఉన్నతాధికారులు అరవింద్‌కు వెల్లడించారు. కాగా.. ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవికి చెందిన వీడియోను తయారుచేశారు. బుధవారం దాన్ని విడుదల చేశారు. 
 
''వచ్చాడు వచ్చాడు.. చిరంజీవి వచ్చాడు! సైడ్‌ ఇవ్వరా భాయ్‌.. చిరునవ్వు ఇస్తాడు.. లేచి స్టెప్‌ వేయరా భాయ్‌! అంటూ.. సాగే పాటతోపాటు చిరంజీవి చిన్నతనం నుంచి ఠాగూర్‌ వరకు చిత్రాల స్టిల్స్‌ ఉన్నాయి. అందులో నాటి ఎన్‌టిఆర్‌. బాలకృష్ణ. ఇప్పటి ఎన్‌టిఆర్‌.. రాజశేఖర్‌, మహేస్‌బాబు, ఇలా అందరితో కలిసిన ఫొటోలు చూపిస్తూ పాట సాగుతుంది. 
 
''అన్నయ్య కమింగ్‌ బ్యాక్‌.. బోలో బోలో.... జై చిరంజీవి.. బోలో....'' అంటూ సాగుతూ.. బాస్‌ సీ బ్యాక్‌. ఎవ్రీబడీ షేక్‌..తో ముగుస్తుంది. మరి 150తో షేక్‌ చేయిస్తాడో లేదో చూడాలిమరి. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments