Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర సంతాపం : చిరంజీవి ట్వీట్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (11:02 IST)
తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను మెగాస్టార్ చిరంజీవి గురువారం పరామర్శించారు. తమిళిసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణ కుమారి (80) అనారోగ్యంతో బుధ‌వారం ఉదయం కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆమె మృతితో తమిళిసై సౌందర్ రాజన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బుధ‌వారం ఆమె పార్థివ దేహాన్ని ప్ర‌ముఖుల సంద‌ర్శ‌నార్ధం రాజ్ భ‌వ‌న్‌లో ఉంచ‌గా, సాయంత్రం తమిళనాడు తీసుకువెళ్లారు. చెన్నైలోని సాలిగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
ఇదిలావుంటే, కృష్ణ కుమారి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో తమిళిసైని పరామర్శించారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు స్టాలిన్‌, రంగస్వామి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించారు.
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా త‌మిళిసైకి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మీ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అంటూ చిరంజీవి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments