స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 13న మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తుండగా, బుధవారం రోజు బన్నీ బర్త్‌డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా అదరగొట్టేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు బన్నీ ఇక "తగ్గేదే లే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Acharya, Chiranjeevi
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన ట్విట్టర్ ద్వారా బన్నీకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. "పుష్ప టీజర్ చూశాను. చాలా రియలిస్టిక్, రస్టిక్‌గా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదే లే" అంటూ కామెంట్ పెట్టారు. పుష్ప టీజర్ జెట్ స్పీడ్‌తో వ్యూస్, లైక్స్ సాధిస్తుండగా, ఇప్పటికే 5 లక్షలు లైక్స్ క్రాస్ అయ్యిపోయిన ఈ టీజర్ సరికొత్త రికార్డ్ సాధించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.