Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసిన చిరంజీవి... ఎవ‌రితో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:25 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో సైరా సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే...చిరంజీవి ఈ సినిమా త‌ర్వాత బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నాడు అంటూ ప్ర‌చారం జ‌రిగింది. జ‌న‌వ‌రిలో ఈ సినిమా ప్రారంభం అవుతుంద‌ని కూడా గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.
 
ఇద‌లాఉంటే... విన‌యవిధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఊహించ‌ని విధంగా నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ ఎవ‌రితో అంటారా..? మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్నాను అంటూ చిరంజీవి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు అని కూడా చెప్పారు. కొస‌మెరుపు ఏంటంటే... ఈ ప్రాజెక్టుని సెట్ చేసింది రామ్ చ‌ర‌ణ్. ఈ విష‌యాన్ని కూడా చిరంజీవి బ‌య‌ట‌పెట్టారు. అంతా బాగానే ఉంది మ‌రి... కొర‌టాల‌తో సినిమా గురించి ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments